Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విజ్‌డమ్ ప్రీ స్కూల్‌ లో కన్నుల పండువగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Author Pulluri srinivas | 04 Sep 2026, 04:41 PM | Array
విజ్‌డమ్ ప్రీ స్కూల్‌ లో కన్నుల పండువగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నర్సంపేట, సెప్టెంబర్ 4:స్థానిక విజ్‌డమ్ ప్రీ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువల పట్ల అవగాహన, గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్నతనం నుంచే మంచి విలువలు, ప్రేమ, నిజాయితీ, ధైర్యం వంటి సద్గుణాలను అలరింపజేయడమే నిజమైన విద్య అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి జీవిత సందేశాన్ని, పండుగ విశిష్టతను ఆయన విద్యార్థులకు వివరించారు. అనంతరం కరెస్పాండెంట్ జహంగీర్ మాట్లాడుతూ.. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, సంస్కృతీ సంప్రదాయాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తూ పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడమే విజ్‌డమ్ ప్రీ స్కూల్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.వేడుకల్లో భాగంగా పాఠశాల చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి, గోపికల వేషధారణల్లో అలరించారు. భక్తిగీతాల ఆలాపనలు, చిన్నారుల నృత్యాలు, ముద్దు ముద్దు మాటలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీమ్ సుల్తానా, అకాడమిక్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ఇన్‌చార్జులు హారిక, శ్రీలత, భద్రయ్య, మధు, సంతోష్‌లతో పాటు ఉపాధ్యాయులు దివ్య, మాధవి, సరితా రాణి, రాధిక, స్వాతి, అఖిల, రజనీ కుమారి, సౌజన్య, రవళి, సుజాత, కళ్యాణి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.