Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య.

Author Sanjeev Panuganti | 01 Sep 2026, 11:30 PM | Array
అర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య.

సింగరేణి ఏఎల్పి ఓవర్‌ మెన్ ఆత్మహత్య

భారత వాసి రామగిరి మండలం
రామగుండం అర్జీ త్రీ
ఆర్థిక ఇబ్బందులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ సింగరేణి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ గుడి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
​పోలీసులు, బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బత్తుల కృష్ణచైతన్య (32) రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో ఓవర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అతను సెంటినరీ కాలనీలోని C-2/127 క్వార్టర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కృష్ణచైతన్య, మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడటానికి కొద్దిసేపటి ముందు తన భార్య పద్మావతితో ఫోన్‌లో మాట్లాడాడు.
​అనంతరం కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ గుడి వద్దకు చేరుకుని, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణచైతన్య ఆత్మహత్యతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సింగరేణి కార్మికులు, అధికారులు కృష్ణచైతన్య మృతిపట్ల తీవ్ర సంతాపం తెలిపారు.

అర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య. - Additional Imageఅర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య. - Additional Imageఅర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య. - Additional Image