Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పుష్కరాల నాటికి కాళేశ్వరం పనులు పూర్తి చేయాలి

Author Eravelli Harshini | 02 Sep 2026, 02:34 PM | Politics
పుష్కరాల నాటికి కాళేశ్వరం పనులు పూర్తి చేయాలి

కాళేశ్వరం: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం దేవాలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించి, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, దేవాలయ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పనులకు స్పష్టమైన లక్ష్యాలు, కాలపరిమితి రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.