Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రెషర్ బాంబు పేలి వ్యక్తి మృతి

Author syed Abzal pasha | 03 Sep 2026, 08:56 AM | TELANGANA
ప్రెషర్ బాంబు పేలి వ్యక్తి మృతి

ఏటూరునాగారం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు (60) ప్రెషర్ బాంబు పేలడంతో మృతి చెందాడు. మంగళవారం ఆరుగురు కలిసి వెదురు బొంగుల కోసం కర్రిగుట్టల్లోకి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో బేడం గుట్ట సమీపంలో నాగేశ్వరరావు ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి వారు డోలిలో గుట్ట కిందకు తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బుధవారం ఉదయం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీస్ అధికారులు ముత్యం రమేష్, కొప్పుల తిరుపతిరావు మృతుడి ఇంటికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో కర్రిగుట్టల సమీపంలో నివసించే ఆదివాసీల్లో భయాందోళన నెలకొంది. పశువుల మేత, వెదురు బొంగుల సేకరణ కోసం నిత్యం గుట్టల వైపు వెళ్లే తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ఇంకా మందుపాతరలు ఉన్నాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.