ప్రెషర్ బాంబు పేలి వ్యక్తి మృతి

ఏటూరునాగారం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు (60) ప్రెషర్ బాంబు పేలడంతో మృతి చెందాడు. మంగళవారం ఆరుగురు కలిసి వెదురు బొంగుల కోసం కర్రిగుట్టల్లోకి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో బేడం గుట్ట సమీపంలో నాగేశ్వరరావు ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి వారు డోలిలో గుట్ట కిందకు తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బుధవారం ఉదయం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీస్ అధికారులు ముత్యం రమేష్, కొప్పుల తిరుపతిరావు మృతుడి ఇంటికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో కర్రిగుట్టల సమీపంలో...