విజ్‌డమ్ ప్రీ స్కూల్‌ లో కన్నుల పండువగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నర్సంపేట, సెప్టెంబర్ 4:స్థానిక విజ్‌డమ్ ప్రీ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువల పట్ల అవగాహన, గౌరవాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్నతనం నుంచే మంచి విలువలు, ప్రేమ, నిజాయితీ, ధైర్యం వంటి సద్గుణాలను అలరింపజేయడమే నిజమైన విద్య అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి జీవిత సందేశాన్ని, పండుగ విశిష్టతను ఆయన విద్యార్థులకు వివరించారు. అనంతరం కరెస్పాండెంట్...