Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పంటపొలాల్లో డిజిటల్ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

Author Pulluri srinivas | 03 Sep 2026, 04:47 PM | TELANGANA
పంటపొలాల్లో డిజిటల్ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద*

వరంగల్ జిల్లా లో పంటల వివారలను కచ్చితంగా నమోదు చేసేందుకు పంటపొలాల్లో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంగెం మండలం రామచంద్రాపురం,దుగ్గొండి మండలం నాచినపల్లి, గిర్నిబావి గ్రామాల్లోని
పంటపొలాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న డిజిటల్ సర్వే తీరును పరిశీలించారు. పంటల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రైతులు సాగు చేస్తున్న పంటలు, వాటి విస్తీర్ణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, డిజిటల్ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

పంటల డిజిటల్ సర్వే ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని, రైతులకు ప్రభుత్వ పథకాల అమలులో ఈ వివరాలు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్శనలో ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు,డిబిసిడిఓ పుష్పలత,సంబంధిత శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.