Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Author Eravelli Harshini | 04 Nov 2026, 02:47 PM | TELANGANA
మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

మహాదేవపూర్: మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.