Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొండగట్టు పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు జనసేన పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకురాలు రాగుల శిరీష జనసేన పార్టీ

Author Hanmanth nayak | 03 Nov 2026, 12:19 PM |
కొండగట్టు పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు జనసేన పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకురాలు రాగుల శిరీష జనసేన పార్టీ

కొండగట్టు అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు?
₹35.19 కోట్ల నిధులతో చేపట్టే పనులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: రాగుల శిరీష**

కరీంనగర్: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని జనసేన పార్టీ వీరమహిళ విభాగం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకురాలు రాగుల శిరీష కోరారు.పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి ₹35.19 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఒకేసారి 2,000 మంది దీక్ష విరమణ చేసుకునేందుకు అనువైన మండపం, 96 విశ్రాంతి గదుల నిర్మాణం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.ఈ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పనుల ప్రారంభం, ప్రస్తుత పురోగతిపై అధికారులు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని కోరారు.
నిధులు విడుదలైన తర్వాత పనులు ఏ దశలో ఉన్నాయి? నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభిస్తారు? పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఎంత? అనే అంశాలపై సంబంధిత అధికారులు ప్రజలకు సమాధానం ఇవ్వాలని రాగుల శిరీష విజ్ఞప్తి చేశారు.కొండగట్టుకు వచ్చే ఆంజనేయస్వామి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం, టీటీడీ, సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె కోరారు.