Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన!

Author Meda raju | 03 Nov 2026, 08:56 AM | Array
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన!

TG: తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో 120 నుంచి 150 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.