Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Author Eravelli Harshini | 02 Nov 2026, 02:44 PM | TELANGANA
కాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

కాళేశ్వరం:మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్, గాడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పాడే సోమవారం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలతో సన్మానించారు. అనంతరం సరస్వతీ పుష్కర ఘాట్‌ను సందర్శించగా, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ప్రాధాన్యతను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివరించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.