Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మంచిర్యాల జిల్లాలో 11 మండలాలు కరువుగా ప్రకటించిన ప్రభుత్వం!

Author Meda raju | 28 Oct 2026, 08:23 PM | TELANGANA
మంచిర్యాల జిల్లాలో 11 మండలాలు కరువుగా ప్రకటించిన ప్రభుత్వం!

మంచిర్యాల: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని 11 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. జిల్లాలోని జనసాంద్రత, వ్యవసాయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
జిల్లాలోని జనార్దన్‌పల్లి, దండేపల్లి, హాజీపూర్, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కరువు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తగిన ఉపశమన చర్యలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.