Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కత్తెరశాలలో ఊరుకొలుపు రెండు రోజుల పాటు ఆంక్షలు!

Author Meda raju | 28 Oct 2026, 08:17 PM | Array
కత్తెరశాలలో ఊరుకొలుపు రెండు రోజుల పాటు ఆంక్షలు!

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరశాల గ్రామంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఊరు కొలుపు (గ్రామ రక్షణ పూజ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు సర్పంచ్ చేతేల్లి పద్మ మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు వివరాలు వెల్లడించారు.
ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామ ప్రధాన రహదారిని మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, పరిసర గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.