Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బీసీల పట్ల ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరిని ఎండగట్టాలి: బీసీ పవర్ రాష్ట్ర కమిటీ

Author Pulluri srinivas | 03 Sep 2026, 04:32 PM | Politics, TELANGANA
బీసీల పట్ల ప్రభుత్వ వివక్షా పూరిత వైఖరిని ఎండగట్టాలి: బీసీ పవర్ రాష్ట్ర కమిటీ

ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దీనిని బీసీ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని బీసీ పవర్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఒకే తరహా అంశాలపై విభిన్న సామాజిక వర్గాల పట్ల రెండంచెల వైఖరిని ప్రదర్శిస్తోందని కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు విమర్శలు లేదా వ్యాఖ్యలు చేస్తే సమర్థించుకునే ప్రభుత్వం... ఒక బీసీ మహిళా కూతురు చేసిన విమర్శలను మాత్రం భూతద్దంలో చూపిస్తూ వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. బీసీలను ఒక రకంగా, రెడ్డి సామాజిక వర్గాన్ని మరో రకంగా చూడటం ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని వారు ధ్వజమెత్తారు.