Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా

Author Pulluri srinivas | 03 Sep 2026, 03:57 PM |
ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా

ఆర్టీసీ డ్రైవర్ వెంకటస్వామి అనుమానాస్పద మృతి: బాధ్యులను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ధర్నా
నర్సంపేట (వరంగల్ జిల్లా):
నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొల్లెపల్లి వెంకటస్వామి రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మృతుడి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంకటస్వామి మృతికి పోతురెడ్డి నరసింహారెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డిలే కారణమని ఆరోపిస్తూ, వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి కాసేపు ఆందోళన, ధర్నా చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.