Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

టీఎంయూ నర్సంపేట డిపో అధ్యక్షుడిగా వేముల రవి గౌడ్ నియామకం

Author Pulluri srinivas | 03 Sep 2026, 08:17 AM | TELANGANA
టీఎంయూ నర్సంపేట డిపో అధ్యక్షుడిగా వేముల రవి గౌడ్ నియామకం

నర్సంపేట: తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నర్సంపేట డిపో అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమ నేత వేముల రవి గౌడ్ నియమితులయ్యారు. అశ్వద్ధామ రెడ్డి గారి నాయకత్వంలో, కార్మికుల పూర్తి అభిప్రాయాలు, మద్దతు మేరకు ఆయనను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నిరంతరం కార్మిక పక్షపాతిగా ఉంటూ వారి సమస్యలపై పోరాడే రవి గౌడ్ నియామకం పట్ల డిపో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంపై డిపో సిబ్బంది మరియు యూనియన్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.