Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భూపాలపల్లిలో కాంగ్రెస్‌ నిరసన.. బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం

Author Eravelli Harshini | 01 Sep 2026, 02:24 PM | Politics
భూపాలపల్లిలో కాంగ్రెస్‌ నిరసన.. బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం

భూపాలపల్లి: ఏఐసీసీ నాయకుడు రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాహుల్‌ గాంధీపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.