రాజకీయ కుట్రలకు మోహన్ రెడ్డి పేరే టార్గెట్టా? కంకుల దుకాణాల వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్న కొందరు నాయకులు! నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం!
చెన్నూర్: హైవే రోడ్డు పక్కన కంకుల దుకాణాల స్థలానికి సంబంధించిన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. అసలు వివాదంతో ఎలాంటి సంబంధం లేని కత్తెరశాల సర్పంచ్ భర్త చేతేల్లి మోహన్ రెడ్డి గారి పేరును పదేపదే తెరపైకి తీసుకురావడం వెనుక కొందరి రాజకీయ స్వలాభాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారులకు ఉచితంగా అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, వ్యాపారాలు చేసుకునేందుకు స్థలం ఇప్పించడంలో సర్పంచ్ చొరవ తీసుకున్నారని స్థానికంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ స్థలానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి తమ స్థలంలో తాము వ్యాపారం చేసుకుంటామని ఖాళీ చేయాలని కోరడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. వ్యాపారులకు సహాయం...