ఇసుక లారీలపై కఠిన నియంత్రణ విధించాలి: చల్లా నారాయణరెడ్డి

మహాదేవపూర్: మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇసుక లారీ ఢీకొని పోత స్వామి మృతి చెందడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గంలో ఇసుక రవాణాపై నియంత్రణ లేకపోవడంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. ఇసుక లారీల అతివేగం, అక్రమ రవాణాను అరికట్టి ప్రజలకు భద్రత కల్పించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించడంతో పాటు బాపు కుమార్తెకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు.