మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఆందోళన
ఇసుక లారీ ఢీకొని మృతి చెందిన పోత స్వామి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 353వ జాతీయ రహదారిపై కమాన్ ప్రాంగణంలో బైఠాయించి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, మంథని మహిళా విభాగం అధ్యక్షురాలు కేదారి గీత ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. లారీ యజమాని, టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి, ఇసుక క్వారీ కాంట్రాక్టర్ అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని, అవసరమైతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సమస్యను...