అంగన్వాడీ చిన్నారులకు ఆట వస్తువులు, వాటర్ బాటిళ్ల పంపిణీ
నర్సంపేట: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా నిర్వహిస్తూ సామాజిక సేవకు ప్రాధాన్యమిచ్చారు నల్ల వంశీకృష్ణారెడ్డి–హర్షిత దంపతులు. తమ కుమారుడు విదిక్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట-4 అంగన్వాడీ కేంద్రంలోని పూర్వ ప్రాథమిక విద్యార్థినీ, విద్యార్థులకు ఆట వస్తువులు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట గ్లోరీ అధ్యక్షుడు మోతె ఇంద్రసేనారెడ్డి, కోశాధికారి నల్ల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రూ.5 వేల విలువైన కో-కరిక్యులర్ ఆట వస్తువులతో పాటు చిన్నారులకు అవసరమైన వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మోతె ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రోజుల్లో అనవసర ఖర్చులు చేయకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. లయన్స్...