ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చిన స్పందన కరువు

ప్రజవాణి లో వినతి పత్రాలిచ్చినా స్పందన కరువు..! -----ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం.. **కరీంనగర్:** ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్‌కు ఐదు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల జనసేన పార్టీ వీరమహిళ నాయకురాలు రాగుల శిరీష తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వివిధ అంశాలపై ఐదు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ, బద్దిపల్లిలో నిరుపయోగంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించడం, స్కాలర్‌షిప్‌ల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు...