ఎంపీ కార్యక్రమానికి హాజరైతే సస్పెండ్ చేస్తారా?
మల్హర్: కాంగ్రెస్ పార్టీ కోసం గత 20 ఏళ్లుగా జెండా మోసి, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తే, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని మల్హర్ మండలం కొయ్యూరు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కార్యక్రమానికి హాజరైనందుకే తమపై సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమని పేర్కొన్నారు.కొయ్యూరు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్తో పాటు వార్డు సభ్యులు లకావత్ లక్ష్మీ, తిరుపతి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖలీంను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల కొయ్యూరు గ్రామంలో...