కరెంట్ షాక్‌తో తొమ్మిదో తరగతి విద్యార్థిని దుర్మరణం: నల్లబెల్లిలో విషాదం

నల్లబెల్లి: విద్యుత్ ఘాతానికి గురై ఓ పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కుమార్తె పిట్టల సిరివెన్నెల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసేందుకు సిద్ధమైన ఆమె, నీటి మోటార్‌ను ఆన్ చేయడానికి స్విచ్ బోర్డు వద్దకు వెళ్లింది. అంతకుముందే ఆ వైర్లను ఎలుకలు కొరికి వేయడంతో, స్విచ్ వేయగానే సిరివెన్నెల తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలింది. ​అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన 108 అంబులెన్స్‌కు సమాచారం...