నర్సంపేటలో కాషాయం వైపు యువత

నర్సంపేట: నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం రోజురోజుకూ పెరుగుతోందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల యువ నాయకులు బీజేపీలో చేరారు. జూలూరి మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన చేరికల కార్యక్రమానికి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటి అరవింద్, ఎస్‌కే అజీమ్ పాషా, కాగితాల అనిల్, మర్రిపల్లి రవి (చిన్న బబ్బులు), కాసుల గణేష్, వల్లభ్‌నగర్‌కు చెందిన రాకేష్ తదితరులు బీజేపీలో చేరారు....