కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై టీఆర్‌ఎస్‌ నిరసన

కాటారం: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని, తిరిగి కేసీఆర్‌ ప్రభుత్వమే...