గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
నల్లబెల్లి మండలం : మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులను, రికార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలపై విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి, వారి అభ్యాసన సామర్థ్యాలను స్వయంగా తెలుసుకున్నారు.ప్రతి విద్యార్థిని చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థినుల భవిష్యత్తుకు పటిష్టమైన పునాది పడేలా నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు.విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్:కళాశాలలోని వంట సామాగ్రి నిలువ గదిని పరిశీలించిన కలెక్టర్, పప్పు దినుసులు, కూరగాయల నాణ్యతను తనిఖీ...