ఇంట్లో నాగుపాము హల్‌చల్‌

ఇంట్లో నాగుపాము హల్‌చల్‌ మహాదేవపూర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో నాగుపాము హల్‌చల్‌ చేసింది. కోళ్ల గూటిపై దాడి చేసి గుడ్లపై పొదిగిన కోడిని కాటేసి, గుడ్లను మింగేసింది. ఇంటి యజమాని సమాచారం మేరకు స్నేక్‌ క్యాచర్‌ ముల్కల కిరణ్‌ అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇళ్లలో పాములు కనిపిస్తే 9959197683 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కిరణ్‌ సూచించారు.