రామగిరి లో మహానేతకు మన నివాళులు

రామగిరి లో ఘనంగా డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు,బుధవారం వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్ రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మండల కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన...