ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినీత్ వెంకటి లట్కారి మృతి చెందాడు. గుమ్మలకొండకు వెళ్తున్న ఆయన ద్విచక్ర వాహనాన్ని, మహాదేవపూర్ వైపు నుండి హైదరాబాద్ వైపు ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వినీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.