🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 04 Nov, 2026 | Page: 1

రాజకీయ కుట్రలకు మోహన్ రెడ్డి పేరే టార్గెట్టా? కంకుల దుకాణాల వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్న కొందరు నాయకులు! నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం!

చెన్నూర్: హైవే రోడ్డు పక్కన కంకుల దుకాణాల స్థలానికి సంబంధించిన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. అసలు వివాదంతో ఎలాంటి సంబంధం లేని కత్తెరశాల సర్పంచ్ భర్త చేతేల్లి మోహన్ రెడ్డి గారి పేరును పదేపదే తెరపైకి తీసుకురావడం వెనుక కొందరి రాజకీయ స్వలాభాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యాపారులకు ఉచితంగా అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, వ్యాపారాలు చేసుకునేందుకు స్థలం ఇప్పించడంలో సర్పంచ్ చొరవ తీసుకున్నారని స్థానికంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ స్థలానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి తమ స్థలంలో తాము వ్యాపారం చేసుకుంటామని ఖాళీ చేయాలని కోరడంతో వివాదం మొదలైనట్లు సమాచారం.
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. వ్యాపారులకు సహాయం చేసిన వారిపైనే తిరిగి ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం? కృతజ్ఞత మరిచి, అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ మోహన్ రెడ్డి గారి పేరును వివాదాల్లోకి లాగడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
పంచాయతీ జరుగుతున్న సమయంలో తన తండ్రికి సంబంధం లేని విషయంలో ఆయన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారని మోహన్ రెడ్డి కుమారుడు ప్రశ్నించగా, ఆ ఘటనను కూడా రాజకీయాలకు వాడుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది కేవలం స్థల వివాదమా? లేక రాజకీయంగా ఒకరిని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమా?
పార్టీలో వర్గపోరు సృష్టిస్తూ, నాయకుల మధ్య విభేదాలు పెంచుతూ, మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఒకరిపై ఆరోపణలు చేయడం సులభమే.. కానీ ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించడం కూడా అంతే ముఖ్యం. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యక్తుల పేర్లను వివాదాల్లోకి లాగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
మీడియా అంటే ఎవరి రాజకీయాలకు వేదిక కాదు.. ప్రజల పక్షాన నిలబడి నిజాలను నిర్భయంగా చూపించే వేదిక.
ఎవరి ఒత్తిడికీ తలొగ్గకుండా, ఎవరి స్వలాభాలకూ తలవంచకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.

నిజం చెప్పడంలో వెనకడుగు లేదు.. నిజాలను వెలికితీయడంలో రాజీ లేదు!

మీ రిపోర్టర్: మేడ రాజు
(న్యూస్ ఛానల్ పేరు భారతవాసి )
🏠 Home