తండాల అభివృద్ధికి టిఆర్ఎస్ హాయంలో నే ప్రధాన్యం
తండాల అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలోనే ప్రాధాన్యం
గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి
గుగులోతు రాజు నాయక్
అక్కన్నపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
అక్కన్నపేట, నవంబర్ 4 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అక్కన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్ మండలంలోని పలు తండాల్లో బుధవారం పర్యటించారు. నూతనంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా హాథిరాం అంబానాయక్ తండా, శ్రీరామ్ తండా, సేవాలాల్ మహారాజ్ తండా, చౌటకుంట తండాలను సందర్శించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.
ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన ఉప ప్రణాళిక నిధుల ద్వారా అక్కన్నపేట మండలంలోని తండాలకు అనుసంధాన రహదారులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు, గిరిజన బంధు కింద రూ.12 లక్షల ఆర్థిక సాయం, తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించడం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇరుగు రమేష్, భూక్య వీరన్న నాయక్, భూక్య రాజు నాయక్, సేవాలాల్ మహారాజ్ తండా నాయకులు బానోతు భాస్కర్ నాయక్, బానోతు తిరుపతి నాయక్, హాథిరాం అంబానాయక్ తండా నాయకులు లునావత్ జుమ్లా, బీమా, శ్రీరామ్ తండా నాయకులు బానోతు విజయ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.