🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 03 Nov, 2026 | Page: 1

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ పోలీసు బందోబస్తు


మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు నేడు బ్యారేజీని సందర్శించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి నిఘా పెంచారు. సందర్శనకు వచ్చే నేతల పర్యటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బ్యారేజీ వద్దకు వచ్చే వాహనాలు, వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
🏠 Home