🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 02 Nov, 2026 | Page: 1

ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చిన స్పందన కరువు

ప్రజవాణి లో వినతి పత్రాలిచ్చినా స్పందన కరువు..!

-----ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం..



**కరీంనగర్:** ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్‌కు ఐదు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల జనసేన పార్టీ వీరమహిళ నాయకురాలు రాగుల శిరీష తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వివిధ అంశాలపై ఐదు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ, బద్దిపల్లిలో నిరుపయోగంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించడం, స్కాలర్‌షిప్‌ల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లకు సంబంధించిన సమస్యలు, దహన సంస్కార ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే రూపాయి సహాయానికి సంబంధించిన సమస్యలు, కరీంనగర్ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపించడం వంటి ఐదు ప్రధాన అంశాలపై వినతులు అందించినట్లు వెల్లడించారు.

ఈ సమస్యలన్నీ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిపై అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వినతి పత్రాలు సమర్పించడం అంటే కేవలం అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం మాత్రమే కాదని, వాటికి పరిష్కారం లభించే వరకు ప్రజల తరఫున ప్రశ్నించడం కూడా బాధ్యతేనని స్పష్టం చేశారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన అధికారులు మౌనం వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వినతి పత్రాలను స్వీకరించిన అధికారులు వాటిపై తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఐదు వినతి పత్రాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాగుల శిరీష కోరారు.

ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ప్రజల తరఫున ప్రశ్నించక తప్పదని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ప్రజల గొంతుకగా నిలుస్తానని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వీరమహిళలు గుండ శకుంతల, కందకట్ల స్వరూప, సుజాతతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.j
🏠 Home