🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 29 Oct, 2026 | Page: 1

ఈవో తీరుపై సర్పంచి ఫైర్


కాళేశ్వరం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల్లో ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చినప్పటికీ, ప్రొటోకాల్ ప్రకారం స్థానిక సర్పంచి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డికి ఈవో మహేష్ సమాచారం ఇవ్వలేదని, ఆహ్వానించలేదని సర్పంచి ఆరోపించారు. గతంలో జరిగిన అనేక అభివృద్ధి పనుల్లోనూ ఇదే తీరుగా సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్ పాటించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే మీడియా సమావేశం నిర్వహించి ఆలయ ఈవో మహేష్ పై ఫైర్ అయ్యారు. ఈవో తీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
🏠 Home