🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 22 Oct, 2026 | Page: 1

వామ్మో.. అన్నారం బ్యారేజీలో మొసలి!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: అన్నారం బ్యారేజీలో మొసలి కనిపించడంతో స్థానికులు, మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా నీటిలో సంచరిస్తున్న మొసలిని జాలర్లు గుర్తించినట్లు సమాచారం. మొసలి నీటిపైకి రావడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బ్యారేజీ పరిసరాల్లో మొసలి సంచారంతో ప్రమాదం పొంచి ఉందని భావించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
🏠 Home