🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 19 Oct, 2026 | Page: 1

సుందరశాల SC కాలనీ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు!



చెన్నూర్:అక్టోబర్:19 సుందరశాల గ్రామం SC కాలనీ లో మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను చేతబట్టి మహిళలు గ్రామ పరిసరాల్లో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, చిన్నారులు వేడుకల్లో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఒకరినొకరు అభినందించుకుంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
🏠 Home