🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 19 Oct, 2026 | Page: 1

వెంకంపేట SC కాలనీ లో ఘనంగా సద్దులబతుకమ్మ బతుకమ్మ సంబరాలు!


చెన్నూర్: అక్టోబర్ -19 వెంకంపేట గ్రామంలోని SC కాలనీ లో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో విద్యుత్ దీపాలు, రంగురంగుల అలంకరణల మధ్య పండుగ వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయిత రాజిరెడ్డి, ఉపసర్పంచ్ మోతె రాజసమయ్య, గ్రామ యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులందరూ కలిసి బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
🏠 Home