🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 17 Oct, 2026 | Page: 1

దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి

మహాదేవపూర్: దసరా సెలవుల నేపథ్యంలో ప్రజలు దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహాదేవపూర్ ఎస్సై సాంబమూర్తి సూచించారు. ఊరికి వెళ్లే ముందు ఇళ్లకు తాళాలు వేసి, విలువైన వస్తువులను భద్రపరచుకోవాలని, ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించవద్దని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో నగదు, మొబైల్ ఫోన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసాల బారిన పడకుండా ఓటీపీ, పిన్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు. అత్యవసర పోలీస్ సహాయం కోసం 112 లేదా 8712658116 నంబర్లకు కాల్ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
🏠 Home