🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 17 Oct, 2026 | Page: 1

అంకీస, వడిదం గ్రామాల్లో శరన్నవరాత్రి వేడుకలు


పలిమెల, భారతవాసి:
మహారాష్ట్రలోని అంకీస, వడిదం గ్రామాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అంకీస గ్రామంలో ఆరో రోజు అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో అలంకరించి, గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. వడిదం గ్రామంలోని శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో సరస్వతీదేవి సన్నిధిలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన చేశారు. రెండు గ్రామాల్లోనూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు పనకంటి దిలీప్ శర్మ నిర్వహించారు. నవరాత్రి వేడుకలతో రెండు గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
🏠 Home