🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 14 Oct, 2026 | Page: 1

కాటారం తహసీల్దార్ కార్యాలయంలో కూలిన స్లాబ్ పెచ్చులు


కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తెల్లవారుజామున ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్ చాంబర్‌లోని పైకప్పు స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా కూలిపడ్డాయి. దీంతో చాంబర్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫైళ్లు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విధుల సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్వహణ, భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, వాటి పరిస్థితిని పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
🏠 Home