🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 11 Oct, 2026 | Page: 1

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినపల్లిలో దసరా పండుగ ఏర్పాట్లలో భాగంగా బల్బులు ఏర్పాటు చేస్తుండగా బౌతు కరుణాకర్ (20) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. సర్పంచ్ ఫోన్ చేసి బల్బులు ఏర్పాటు చేసేందుకు తీసుకెళ్లారని, తమ కుమారుడి మృతికి ఆయనే బాధ్యుడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సర్పంచ్ జగదీశ్వర్ తెలిపారు. తాను కరుణాకర్‌ను రమ్మని చెప్పలేదని, విద్యుత్ షాక్‌కు గురై పడిపోయినట్లు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వెంటనే 108 వాహనంలో మహాదేవపూర్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
🏠 Home