🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 11 Oct, 2026 | Page: 1

స్టీరింగ్ ఫెయిల్.. అడవిలోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కూదురుపల్లి–ఎడపల్లి మధ్య జాతీయ రహదారిపై ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ స్టీరింగ్‌ ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి టిప్పర్‌ను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
🏠 Home