🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 10 Oct, 2026 | Page: 1

ఘనంగా బతుకమ్మ వేడుకలు

నర్సంపేట, అక్టోబర్ 10: నర్సంపేట పట్టణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను చేతబట్టి మహిళలు ఆలయం పరిసరాల్లో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, చిన్నారులు వేడుకల్లో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఒకరినొకరు అభినందించుకుంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
బతుకమ్మ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయాన్ని చాటారు.
🏠 Home