🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 09 Oct, 2026 | Page: 1

బైక్ అదుపుతప్పి భార్యాభర్తలకు గాయాలు

మహాదేవపూర్, భారతవాసి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు శంకర్, పుష్పలత గాయపడ్డారు. పత్తిపాక నుంచి మహాదేవపూర్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో అడవి పందుల గుంపు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడినట్లు వారు తెలిపారు.అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి క్షతగాత్రులను ప్రైవేటు ఆటోలో మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. 108 అంబులెన్స్ సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్యాభర్తల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వారి బంధువులు తెలిపారు.
🏠 Home