🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 09 Oct, 2026 | Page: 1

బతుకమ్మ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి

మహాదేవపూర్, భారతవాసి: బతుకమ్మ పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి అవసరమైన అనుమతులు తీసుకోవాలన్నారు.
ప్రధాన రహదారులు, కూడళ్లలో రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించరాదని, మద్యం సేవించి అల్లర్లు, అసభ్య ప్రవర్తనకు పాల్పడకుండా చూడాలని సూచించారు. డీజేలు, ధ్వని పరికరాల వినియోగంలో శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలని, బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయాలని సీఐ సూచించారు.
🏠 Home