🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 04 Oct, 2026 | Page: 1

శిశువుల వార్డులో కూలిన పైకప్పు.. తప్పిన ముప్పు

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శిశువుల అత్యవసర చికిత్స వార్డులో పైకప్పు సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ ఒక్కసారిగా కూలిపడింది. భారీ శబ్దంతో పెచ్చులు నేలపై పడటంతో సిబ్బంది, రోగుల బంధువులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఘటన సమయంలో అక్కడ శిశువులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రి భవనాల నిర్వహణపై అధికారులు తక్షణం దృష్టి సారించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
🏠 Home