🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 03 Oct, 2026 | Page: 1

రేషన్‌ బియ్యం దందా నిర్వాహకుడి అరెస్టు

భూపాలపల్లి, భారతవాసి: పేదలకు పంపిణీ చేసే పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా సభ్యుడు మోటం శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. భూపాలపల్లి, పరిసర ప్రాంతాల్లో 14 మంది ఏజెంట్ల ద్వారా జూన్‌ నుంచి ఆగస్టు వరకు సుమారు 3,400 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.25–28కు విక్రయించినట్లు తెలిపారు. లావాదేవీలకు సంబంధించిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
🏠 Home