🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 03 Oct, 2026 | Page: 1

ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా కుంరం చత్రుఘన్ నియామకం*

*ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా కుంరం చత్రుఘన్ నియామకం*

గుడిహత్నూర్ భారత వాసి:

ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా కుంరం చత్రుఘన్ ను నియమిస్తున్నట్లు ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం, అలాగే జిల్లాలో ఆదివాసీ సేన సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

కుంరం చత్రుఘన్ నియామకం పట్ల ఆదివాసీ సేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆదివాసీల సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
🏠 Home