🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 02 Oct, 2026 | Page: 1

గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళి!

హైదరాబాద్‌:లోని గాంధీ భవన్‌లో మహాత్మునికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి, సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని గుర్తుచేశారు.
గాంధీజీ చూపిన అహింసా మార్గం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మహాత్మునికి మనం అందించే నిజమైన నివాళి అని చాటిచెప్పారు.
🏠 Home